వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి గెలుపు ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వార్డు పరిధిలో తెరాస అభ్యర్థి చిదురాల దేవేందర్ తరఫున ప్రచారం చేశారు. తెరాస చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. గత పాలకులు రాష్ట్రాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో భాజపా అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు.
'పరకాల మున్సిపాలిటీ ఉపఎన్నికలో తెరాస గెలుపు ఖాయం' - తెలంగాణ వార్తలు
పరకాల మున్సిపాలిటీ 9వ వార్డులో తెరాసదే గెలుపు అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని ఓటర్లను కోరారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం, పరకాల మున్సిపల్ ఎన్నికలు
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవని అన్నారు. కరోనా విపత్తులోనూ సీఎం కేసీఆర్ అన్ని పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రూ.10.25కోట్లతో శ్రీనివాస కాలనిలోని కల్వర్టు సమస్యను త్వరలోనే శాశ్వతంగా పరిష్కరిస్తామి హామీ ఇచ్చారు. పరకాల ప్రజల చిరకాల వాంఛ 100 పడకల ఆస్పత్రి మంజూరైందని గుర్తు చేశారు. తెరాసకే ఓటు వేసి గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు.
ఇదీ చదవండి:'ఈటీవీ బాలభారత్' ఛానళ్లను ప్రారంభించిన రామోజీరావు