తెలంగాణ

telangana

ETV Bharat / state

'భాజపా, కాంగ్రెస్​లకు పరకాలలో పట్టులేదు' - వరంగల్​ తాజా వార్త

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరకాలలో భాజపా కాంగ్రెస్​ పార్టీలకు పోటీలో నిలబడటానికి అభ్యర్థులే కరవయ్యారని విమర్శించారు.

mla campaign in warangal rural
'భాజపా, కాంగ్రెస్​లకు పరకాలలో పట్టులేదు'

By

Published : Jan 20, 2020, 4:29 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా తెరాస పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
పరకాల మున్సిపాలిటీ 22 వార్డులకు గానూ 11 వార్డులను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరో 11 వార్డుల్లో తెరాస అభ్యర్థులు పోటీలో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పరకాలలో భాజపా, కాంగ్రెస్ పార్టీలకు పట్టులేదని.. పోటీలో నిలబడటానికి అభ్యర్థులే కరవయ్యారని విమర్శించారు. తెరాస పార్టీని ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

'భాజపా, కాంగ్రెస్​లకు పరకాలలో పట్టులేదు'

ABOUT THE AUTHOR

...view details