దండం పెడతా రోడ్లపైకి రావొద్దు: ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ - telangana lockdown
రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న కొంత మంది అనవసరంగా బయటకు వస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో అనవసరంగా రోడ్లపైకి రావొద్దని ప్రజలను కోరారు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్. దండం పెట్టి మరీ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
దండం పెడతా రోడ్లపైకి రావొద్దు: ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పర్యటించి అనవసరంగా రోడ్లపైకి రావొద్దని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రజలను కోరారు. దండం పెట్టి మరి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ను నివారించాలంటే ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ప్రజలందరూ బాధ్యతగా పాటించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు.