వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోని 650 మంది పేద ముస్లింలకు సరకులు పంపిణీ చేశారు. వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ హాజరై రంజాన్ కానుకగా నిత్యావసరాలు అందించారు.
650 ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ - వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట తాజా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆరూరి గట్టు మల్లు ఫౌండేషన్ ద్వారా 650 ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొని ఆ కుటుంబాలకు సరకులను అందజేశారు.
650 ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ
లాక్డౌన్ దృష్ట్యా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేశారు. తన తండ్రి పేరుపై ఏర్పాటు చేసిన ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని ప్రజలకు సేవలందిస్తున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు.
ఇదీ చూడండి :గోదావరిలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి