ఒక వైపు అభివృద్ధి... మరో వైపు సంక్షేమ పథకాలతో తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి కాలనీలో వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ రావుతో కలిసి స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
'ఎన్నికలు ఉన్నా.. లేకపోయినా నిత్యం ప్రజల్లోనే ఉంటా' - mla aruri ramesh latest news
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెరాస ప్రభుత్వం ముందుకు వెళుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఉన్నా.. లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.
ఎన్నికలు ఉన్నా.. లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటా
కాలనీలో డ్రైనేజీలు, సీసీ రోడ్లను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోతున్నారని కొనియాడారు. దశల వారీగా వరంగల్ నగరం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నగర వాసులకు అండగా ఉంటానని.. ఎన్నికలు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.