సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు పథకాల వల్లనే సహకార ఎన్నికల్లో ఘన విజయం సాధించామని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. విజయం సాధించిన అభ్యర్థులు హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యేను కలిశారు.
'ప్రభుత్వ పథకాల వల్లే తెరాస అభ్యర్థులకు రైతుల మద్దతు'
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో తెరాస మద్దతుదారులు విజయఢంకా మోగించారు. గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను కలిశారు. ప్రభుత్వ పథకాలే తెరాస మద్దతుదారులను గెలిపించాయని రమేశ్ తెలిపారు.
MLA ARURI RAMESH COMMENTS ON PACS ELECTIONS WINNING
నియోజకవర్గంలో మొత్తం 146 డైరెక్టర్ల పదవులకు గాను 122 స్థానాలను గెలుచుకున్నామని రమేశ్ తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ లాంటి ఎన్నో కార్యక్రమలు అమలు చేస్తూ రైతులకు తెరాస ప్రభుత్వం మేలు చేస్తోందని వివరించారు. వాటి వల్లే సహకార ఎన్నికల్లో తెరాస బలపర్చిన అభ్యర్థులకు రైతులు బ్రహ్మరథం పట్టరాని రమేశ్ తెలిపారు.
ఇవీ చూడండి:శంషాబాద్‌లో 1100 గ్రాముల బంగారం పట్టివేత