సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కార్యకర్తలను తెరాస ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కోరారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై.. శ్రేణులకు సభ్యత్వం అందించారు.
వర్ధన్నపేటలో జోరుగా తెరాస సభ్యత్వ నమోదు - ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
తెరాస చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పాల్గొన్నారు.
వర్ధన్నపేటలో జోరుగా తెరాస సభ్యత్వ నమోదు
నమోదు ప్రక్రియలో కార్యకర్తలు.. శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ ప్రణాళికపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి:రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్
Last Updated : Feb 14, 2021, 4:49 PM IST