వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్... మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
కేటీఆర్ పుట్టినరోజు కానుకగా మొక్కలు నాటిన పార్టీశ్రేణులు
తెరాస కార్యనిర్వాహణ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో తెరాస శ్రేణులు మొక్కలు నాటారు.
కేటీఆర్ పుట్టినరోజు కానుకగా మొక్కలు నాటిన పార్టీశ్రేణులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మనిషికో మొక్కను నాటి మంత్రి కేటీఆర్‌కు ఆకుపచ్చని తెలంగాణను బహుమానంగా ఇద్దామని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు.కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తామే చేపడాతమని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ మాస్కును ధరించి భౌతిక దూరం పాటించారు.
ఇవీ చూడండి:కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు