తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు పేరుగా ఉన్న బతుకమ్మ పండుగను ప్రపంచ దేశాలకు తెలిసేవిధంగా కృషి చేసింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కొనియాాడారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, బూర్గుమల్ల గ్రామాల్లో బతుకమ్మ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
సద్దుల బతుకమ్మకు ఎమ్మెల్యే ఆరూరి స్టెప్పులు..
సద్దుల బతుకమ్మ పండుగ సందర్బంగా వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. కోలాటం ఆడుతూ మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు.
సద్దుల బతుకమ్మకు ఎమ్మెల్యే ఆరూరి స్టెప్పులు..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండగను అధికారికంగా జరిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. బతుకమ్మ ఆడుతున్న మహిళలతో కలిసి కాసేపు స్టెప్పులేసి అందరిని ఎమ్మెల్యే ఆరూరి అలరించారు.
ఇదీ చూడండి:మున్నేరు నది ఒడ్డున సద్దుల బతుకమ్మ వేడుకలు