వరంగల్ గ్రామీణ జిల్లాలో పట్టణ ప్రతి కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటించారు. కాలనీల్లో నెలకొన్న వివిధ సమస్యలను గురించి... పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు శక్తి వంచన లేకుండా పనిచేసి వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కోరారు.
వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటన - MLA AROORI RAMESH PARTCIPATED VARDHANNAPET PATTANA PRAGATHI
పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పర్యటించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటన
అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తడి, పొడి చెత్త కోసం బుట్టలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో చెత్త సేకరణకు గాను 2 ట్రాలీ ఆటోలను ప్రారంభించారు.