తెలంగాణ

telangana

ETV Bharat / state

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - వరంగల్​ గ్రామీణ జిల్లా వార్తలు

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం తిమ్మాపూర్​లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శాసనసభ్యులు అరూరి రమేష్​ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మట్టి రోడ్లు కనిపించొద్దని అధికారులను ఆదేశించారు.

mla aroori ramesh laid foundation for the cc road works in warangal rural district
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

By

Published : Jun 10, 2020, 6:08 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో మట్టిరోడ్లు కనిపించొద్దని అధికారులను ఎమ్మెల్యే అరూరి రమేష్​ ఆదేశించారు. వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామ పరిధిలోని తిమ్మాపూర్​లో 40లక్షల 38వేల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంచాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. వర్షాకాలంలో అంటు వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: పదో తరగతి విద్యార్థులను అప్​గ్రేడ్​ చేస్తూ జీవో

ABOUT THE AUTHOR

...view details