కరోనా కష్టకాలంలో దాతలు ముందుకు రావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో గ్రామ తెరాస నాయకుల సాయంతో నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరకులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
'పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి' - warangal rural district
వరంగల్ గ్రామీణ జిల్లా ఇల్లంద గ్రామంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
'పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి'
ఎన్నికల్లో కాదు కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలువాలని పార్టీ శ్రేణులకు, గ్రామ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోల్పోయిన వారిని అక్కున చేర్చుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఇవీ చూడండి: హరీశ్ చేతుల మీదగా ఇళ్ల పట్టాలు పంపిణీ