'ఏ ఒక్కరూ అన్నంలేక పస్తులు ఉండకూడదు' - Aroori Ramesh distributes essential commodities to poor people in Vardhanpet
లాక్డౌన్ కారణంగా నిరుపేదలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు ముందుకురావటం సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. వర్ధన్నపేటలో ఆరూరి ఫౌండేషన్ ద్వారా పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఏ ఒక్కరూ అన్నంలేక పస్తులు ఉండకూడదు
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి దరిచేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటిపట్టున ఉండాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం ఆకలితో ఏ ఒక్కరూ పస్తులు ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని నిరుపేదలకు, దినసరి కూలీలకు ఆరూరి ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.