తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సాయం - ఎమ్మెల్యే అరూరి రమేష్ తాజా వార్తలు

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ సాయం చేశారు. 20 వేల రూపాయలను అందజేశారు.

mla aroori ramesh distributed 20 thousand rupees for a family
ప్రతీ కుటుంబానికి రూ.20 వేలు అందజేసిన ఎమ్మెల్యే

By

Published : Jun 5, 2021, 2:04 PM IST

కరోనా బాధిత కుటుంబాలకు ప్రతీ ఒక్కరూ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సూచించారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఆయన సాయం చేశారు. కేఎన్​ఆర్ కన్స్​ట్రక్షన్ వారి సహకారంతో ఒక్కో కుటుంబానికి 20 వేల రూపాయలను అందించారు.

అలాగే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి గతంలోనే కోటి రూపాయలు, మందులను అందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రతీ ఒక్కరు సాయం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా బాధితులకు అండగా నిలిచిన కేఎన్​ఆర్ కన్స్​ట్రక్షన్స్ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.

ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

ABOUT THE AUTHOR

...view details