కరోనా వాక్సిన్ అందడం లేదన్న ఫిర్యాదులతో.. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్‌లోని వార్డులన్ని పరిశీలించి.. వాటిని పరిశుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. వాక్సిన్ పంపిణీలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు - వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్‌లోని వార్డులన్ని పరిశీలించి.. వాటిని పరిశుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
mla aroori ramesh
వాక్సిన్ అందడం లేదన్న ఫిర్యాదులతో తనిఖీ చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అనంతరం ఇల్లంద గ్రామంలో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
ఇదీ చదవండి:రెండు వారాల్లో మూడింతలు.. ఐసీయూల్లో పెరిగిన కొవిడ్ బాధితులు