తెలంగాణ

telangana

రైతులు రోడ్లెక్కితే.. మిల్లర్లు బ్లాక్​ లిస్ట్​లోకి..

By

Published : May 22, 2021, 1:34 PM IST

మిల్లర్లు, అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని గుర్తించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లు త్వరగా జరగాలని అధికారలను ఆదేశించారు.

mla aaroori ramesh review meeting
మిల్లర్లు, అధికారులతో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమీక్షా సమావేశం

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మిల్లర్లు, అధికారులతో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మిల్లర్లు, అధికారుల సమన్వయ లోపం వల్లే కొనుగోళ్లు జరగడం లేదని గుర్తించిన ఎమ్మెల్యే... సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైతులు రోడ్లెక్కితే మిల్లర్లను బ్లాక్ లిస్ట్​లో చేర్చుతామని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హెచ్చరించారు. ధాన్యాన్ని తరలించేందుకు సరిపడా లారీలను మంజూరు చేయాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్​కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేాశారు.

ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

ABOUT THE AUTHOR

...view details