తెలంగాణ

telangana

ETV Bharat / state

'కష్టకాలంలోనూ నిరుపేదలకు అండగా తెరాస' - kalyana laxmi cheques distribution

వరంగల్ గ్రామీణ జిల్లాలో.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

mla aaroori ramesh kalyana laxmi distributed kalyanlaxmi cheques
కష్టకాలంలోనూ నిరుపేదలకు అండగా తెరాస

By

Published : Jan 31, 2021, 11:02 AM IST

నిరుపేద ప్రజల అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్కొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో.. పర్వతగిరి మండలానికి చెందిన 64మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

సంక్షేమమే ధ్యేయంగా..

తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల‌ పుడితే బాధపడే రోజులు పోయాయని తెలిపిన ఎమ్మెల్యే.. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చాడని తెలిపారు.

ఇదీ చదవండి:పిల్లల్ని ఎత్తుకెళ్లే రాబందులు

ABOUT THE AUTHOR

...view details