తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీకేజీ.. ఆరుగంటలుగా తాగునీరు వృథా - warangal rural district news

వరంగల్​ గ్రామీణ జిల్లా వంచనగిరి సమీపంలో మిషన్​భగీరథ పైప్​లైన్​ లీక్​ అయింది. సుమారు ఆరుగంటల పాటు తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

mission bhageeradha pipeline leakage
mission bhageeradha pipeline leakage

By

Published : Mar 3, 2021, 12:02 PM IST

మిషన్​ భగీరథ అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఎక్కడో చోట తాగునీరు వృథా అవుతూనే ఉంది. తాజాగా వరంగల్ గ్రామీణ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరి వద్ద పైప్​లైన్​ లీకైంది. సుమారు ఆరు గంటలుగా నీరు ఎగిసిపడుతున్నా.. అధికారులు అటువైపు చూడనే లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా వంచనగిరి పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారిపైకి నీరు చేరి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

కాకతీయ కాలువ సమీపంలో ఉన్న మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారని.. ఫలితంగా మిషన్​ భగీరథ పైప్​లైన్​ పగిలి తాగునీరు వృథాగా పోతోందని స్థానికులు తెలిపారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీకేజీ.. ఆరుగంటలుగా తాగునీరు వృథా

ఇవీచూడండి:అమ్మ లేదని.. ఇక తిరిగిరాదని.. తెలియని ఓ పసిప్రాయం

ABOUT THE AUTHOR

...view details