Mirchi Purchase in Enumamula Market : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి పంట కొనుగోళ్లు యథావిథిగా ప్రారంభమయ్యాయి. సోమవారం రోజున రణరంగాన్ని తలపించిన మార్కెట్లో ఇవాళ ప్రశాంతంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. జెండా పాటను నిలిపివేసి కొనుగోళ్లు చేయాలని మార్కెట్ అధికారులు వ్యాపారులకు సూచించారు.
Enumamula Market in Warangal : సోమవారం చోటుచేసుకున్న పరిణామాలతో పోలీసులు.. మిర్చి యార్డులో బందోబస్త్ను ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళన దృష్ట్యా.. సోమవారం రోజున మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళ, బుధవారాల్లో మార్కెట్కు సెలవు ప్రకటించినా.. సోమవారం నిలిచిపోయిన కొనుగోళ్లను ఇవాళ ప్రారంభించారు. మరోవైపు ఈరోజు మార్కెట్ యార్డుకు వచ్చిన పంటనూ కొనుగోలు చేస్తున్నారు.