కాళేశ్వరం ద్వారా సమృద్ధిగా జలాలు వస్తున్నందున... ఇక సాగు నీటి కొరత ఉండదని మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్, లోయర్ మానేరు డ్యాం నుంచి నీటి విడుదలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.
'' కాళేశ్వరం పూర్తి స్థాయిలో మిడ్మానేరుతో లింకై ఉంది కాబట్టి... నీళ్లకు కొదవ లేదు. ఈ విషయమై కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా అధికారులతో ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఎలా చేసుకుంటే చివరి ఆయకట్టుకు ఏ ఇబ్బంది లేకుండా నీరు అందించగలమో... ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు వారికి సహకరించాలి.''
- మంత్రి ఈటల రాజేందర్