వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు… ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకే… కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినట్టు మంత్రులు తెలిపారు.
'వీఆర్ఓ, వీఆర్ఏలకు భయం అవసరం లేదు.. సముచితస్థానం కల్పిస్తాం' - పర్వతగిరిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నూతన రెవిన్యూ చట్టం శాసనసభలో ఆమోదం పొందిన సందర్భంగా... వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో రైతులతో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాక్ రావు పాలాభిషేకం నిర్వహించారు.
కేసీఆర్ చిత్రపటానికి మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ పాలాభిషేకం
వీఆర్ఓలు, వీఆర్ఏలు భయపడనవసరం లేదన్న మంత్రులు… వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ నిర్ణయంతో రైతులు, ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు.