కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ కేసు నమోదు కావడం వల్ల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని వైద్యులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అంతకు ముందుగా నూతనంగా 25 పడకలతో ఏర్పాటు చేసిన వార్డును ఆయన సందర్శించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలతో పాటు ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛ ఆటోలలో ప్రచారం చేయాలని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్‌కు సూచించారు.