రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ప్రతి ధాన్యం గింజనీ కొనుగోలు చేస్తాం: మంత్రి ఎర్రబెల్లి - వరంగల్ గ్రామీణ జిల్లా
రైతులు దిగులు పడొద్దని... పండించిన ప్రతి ధాన్యం గింజని కొనుగోలు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ప్రతి ధాన్యం గింజనీ కొనుగోలు చేస్తాం: మంత్రి ఎర్రబెల్లి
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రైతాంగంపై ఉన్న ప్రేమతో ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు కరోనా దృష్ట్యా సామాజిక దూరంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ధాన్యం విషయంలో రైతన్నలు దిగులు చెందొద్దని.. సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎర్రబెల్లి తెలిపారు.
ఇదీ చూడండి:'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం