వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో పురఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల తరఫున మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో తెరాస జెండాఎగరవేయడం ఖాయమని పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణంలో రెండువందల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
'90శాతం ఓట్లు తెరాసకే రావాలి' - Minister Satyavati ratode Municipal elections in Warangal rural district
మున్సిపల్ ఎన్నికలలో వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో అన్ని వార్డులు గెలుచుకుంటామని గిరిజన, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాఠోడ్ ధీమా వ్యక్తం చేశారు. పోలైన ఓట్లలో తెరాస అభ్యర్థులే 90శాతం ఓట్లు తెచ్చుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

'90శాతం ఓట్లు తెరాసకే రావాలి'
పట్టణం ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే తెరాస అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. మంత్రితో పాటు ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
'90శాతం ఓట్లు తెరాసకే రావాలి'
ఇవీ చూడండి: విరసం కార్యదర్శి కాశీంను హాజరుపర్చండి: హైకోర్టు ఆదేశం
TAGGED:
90శాతం ఓట్లు తెరాసకే రావాలి