వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావి ఘటనపై మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. శుక్రవారం నలుగురి మృతదేహాలు బయటపడగా.. ఇవాళ మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇలాంటి ఘటన జరగడం చాలా విచారకరమని మంత్రి పేర్కొన్నారు.
'అవి హత్యలైతే ఎవరినీ వదిలే ప్రసక్తేలేదు ' - Minister Satyavati Rathod responded on gorrekunta well
గొర్రెకుంట బావి ఘటనపై మంత్రి సత్యవతి రాఠోడ్ విచారం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇవి ఆత్మహత్యలు కాకపోతే... దీని వెనకా ఎవరైనా ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'బావి ఘటన వెనకలా ఎవరైన ఉంటే వారికి కఠిన చర్యలే'
మొన్నటి వరకు వలస కూలీలు ఎవరు ఉన్నా... ఎక్కడ ఉన్నా.. కనుక్కోని వారికి సహాయం చేశామని వెల్లడించారు. కానీ 20 ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్న వారు ఇలా చనిపోవడం బాధకరమని చెప్పారు. ఒకవేళ ఇవి ఆత్మహత్యలు కాకపోతే... దీని వెనకాా ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి ఆత్మహత్యాలా లేదా హత్యలా ..అని దర్యాప్తు జరుగుతోంది. ఒకవేళ ఇవి హత్యలు అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం... సత్యవతి రాఠోడ్, మంత్రి
Last Updated : May 22, 2020, 5:06 PM IST
TAGGED:
Minister Satyavati Rathod