తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర రైతులు కూడా గళమెత్తాలి: మంత్రులు - Minister Errabelli latest news

వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం కొండపాకలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు కలిసి రైతు వేదికను ప్రారంభించారు. రాష్ట్ర రైతులు కూడా గళమెత్తాలని పిలుపునిచ్చారు.

errabelli
రాష్ట్ర రైతులు కూడా గళమెత్తాలి: మంత్రులు

By

Published : Feb 9, 2021, 1:37 PM IST

రాష్ట్ర రైతులు కూడా గళమెత్తాలి: మంత్రులు

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ శాసనసభలో తీర్మానం చేయాలని కాంగ్రెస్‌ కోరడం అర్ధంలేని డిమాండ్‌ అని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం కొండపాకలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి రైతు వేదికను ప్రారంభించారు.

10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములు మంజూరు చేయిస్తానని మంత్రి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాగు చట్టాలతో రైతుల విశాల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అన్నదాతలను ఆదుకుంటామన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సాగు చట్టాలపై రాష్ట్ర రైతులు గళం విప్పాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details