KTR on MLA Dharmareddy: మెగా టెక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేసిన కీలక కంపెనీల కోసం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు.. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో కృషి చేశారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో కైటెక్స్ టెక్స్ టైల్ పార్కుకు కేటీఆర్ భూమిపూజ చేశారు.
ఈ టెక్స్‌టైల్ పార్కు వరంగల్‌కు రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డినేనని ఆయన తెలిపారు. ఇది వేరే ఎమ్మెల్యేలతో సాధ్యం కాకపోయేదని.. చల్లా ధర్మారెడ్డి కాబట్టి పట్టుబట్టి సాధించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్వాతిముత్యం సినిమా స్టోరీలో కమల్‌హాసన్‌లాగా.. ఈ పార్కు కోసం ఎమ్మెల్యే ధర్మారెడ్డి పట్టుబట్టారని వెల్లడించారు.