రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా: ఇంద్రకరణ్ - Minister Indrakaran Reddy visited Sri Bhadrakali Temple in Warangal
వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళీ అమ్మవారిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను: మంత్రి ఇంద్రకరణ్
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనతోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆర్థికంగా పరిపుష్టిగా ఎదగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అంతకు ముందుగా ఆలయానికి వచ్చిన ఇరువురు మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.