Minister Harishrao Inaugurates Medical College in Hanmakonda : కేసీఆర్ పాలనలో వైద్యారోగ్యరంగంలో ఒక విప్లవం వచ్చిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హనుమకొండలోని హంటర్‌రోడ్డులో ఫాదర్ కొలంబో వైద్య కళాశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి హరీశ్ ప్రారంభించారు. అలాగే హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్ప్రారంభించారు. దీంతో పాటు కేఎంసీలో అకాడమిక్ బ్లాక్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
Harish on Health City :60 ఏళ్లలో 3 ప్రభుత్వ కాలేజీలు ఉంటే, 9 ఏళ్లలో 21కి చేరాయని చెప్పుకొచ్చారు. గతంలో ప్రభుత్వ, ప్రైవేటులో 20 వైద్య కళాశాలలు ఉంటే.. నేడు ఆ వైద్య కళాశాలల సంఖ్య 55కు చేరాయని చెప్పుకొచ్చారు. అలాగే ఎంబీబీఎస్ సీట్లు 2,950 నుంచి 8,340కిపెరిగాయని తెలిపారు. వైద్యాన్ని, విద్యను అందుబాటులోకి తేవాలని పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు తెలంగాణలో పెట్టుకోవడం జరిగింది. అంటే ఇవాళ విద్యార్థులకు మూడింతలు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ రాకుంటే ఇన్ని కాలేజీలు మనకు వచ్చేవా? కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఇన్ని సీట్లు మన పిల్లలకు దక్కేవా అని మీరందరు ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
"ఇవాళ వైద్య, ఆరోగ్య రంగంలో ఒక విప్లవం వచ్చింది తెలంగాణ వచ్చాక. అరవై ఏళ్లలో తెలంగాణలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే ఇవాళ కేసీఆర్ హయాంలో 21 ప్రభుత్వ కళాశాలలొచ్చాయి. 1100 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణకు అద్భుతమైన సేవలందించే హెల్త్ సిటీ పనులు ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి కార్పొరేట్ వైద్యాన్ని వరంగల్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి తేబోతున్నాం."-హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి