త్వరలోనే పేదలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించే ప్రయత్నం... తెరాస ప్రభుత్వం చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హసన్పర్తి మండలం దేవన్నపేటలోని 65వ డివిజన్లో తెరాస అభ్యర్థి గుగులోతు దివ్య తరఫున ప్రచారం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని మంత్రి ఈటల తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కదిలిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.