తెరాస ప్రభుత్వం ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేందుకే ఆస్తుల నమోదు కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజలంతా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం రాగన్నగూడెంలో ఆస్తుల నమోదుకు సంబంధించిన అపోహలను. ప్రజల అనుమానాలను నివృత్తి చేశారు. ప్రజలతో " నేను మీ ఎర్రబెల్లి దయాకర్ రావుని...! మీ అభిమాన ఎమ్మెల్యేని... మంత్రిని...!!" అంటూ ఆప్యాయంగా మాట్లాడారు.
గ్రామాల్లో అపోహలు వద్దు.. మీ ఆస్తులు నమోదు చేసుకోండి: మంత్రి ఎర్రబెల్లి
" నేను మీ ఎర్రబెల్లి దయాకర్ రావుని...! మీ అభిమాన ఎమ్మెల్యేని... మంత్రిని..!" అంటూ ప్రజలతో మమేకమయ్యారు మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు. వరంగల్ గ్రామీణ జిల్లా రాగన్నగూడెంలో ఆస్తుల నమోదుకు సంబంధించిన అపోహలను, అనుమానాలను నివృత్తి చేసి ప్రజలను చైతన్యపరిచారు.
గ్రామాల్లో అపోహలు వద్దు.. మీ ఆస్తులు నమోదు చేసుకోండి: మంత్రి ఎర్రబెల్లి
కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రజల ఆస్తులను నమోదు చేస్తున్న అధికారులతో మంత్రి మాట్లాడారు. నమోదు ఎలా జరుగుతోందని అధికారులను అఢిగి తెలుసుకున్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్న మంత్రి.. భవిష్యత్లో బ్యాంకు రుణాలతో పాటు ఇతర రుణాలను సులువుగా పొందవచ్చని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: గ్రామ కార్యదర్శికి ఆస్తుల వివరాలు తెలిపిన సీఎం కేసీఆర్