వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బావిలో పడి మృతిచెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. చనిపోయిన వారిలో ఆరుగురు పశ్చిమ్ బంగ, ఇద్దరు బిహార్ నుంచి వచ్చారని మంత్రి తెలిపారు.
మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి - minister errabelli latest news
వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బావిలో పడి ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఎనిమిది మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రి మార్చురికి తరలించగా... వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్, జిల్లా కలెక్టర్ హరితతో కలిసి మంత్రి పరిశీలించారు.
minister errabelli
దుర్ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. మృతదేహాలకు దహన సంస్కారాలు కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.