సహకార బ్యాంకులు, సొసైటీల ద్వారానే రైతులకు నిజమైన సహకారం అందుతుందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా డీసీసీబీ ఛైర్మన్, డైరెక్టర్లు, ఉద్యోగులు వ్యవహరించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి పర్వతగిరి కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ ఆధ్వర్యంలో రూపొందించిన మొబైల్ ఏటీఎం వాహనాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
వాణిజ్య బ్యాంకులున్నప్పటికీ, సహకార బ్యాంకుల ద్వారానే రైతాంగానికి నిజమైన సహకారం అందుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా డీసీసీబీ అధికారులు వ్యవహరించాలని సూచించారు. రైతులను రాజులను చేయడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారన్న మంత్రి.. రైతుబంధు, రుణమాఫీ, విత్తనాలు, ఎరువులు అందించడం, పంటలను కొనుగోలు చేయడం వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఒక్క తెరాసనే అన్నారు.