తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదలను ఆదుకుంటున్న దాతలను ప్రభుత్వం మరిచిపోదు' - minister-errabelli-says-government-will-not-forget-donors-who-care-for-the-poor

ప్రజల శ్రేయస్సుకై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

minister-errabelli-says-government-will-not-forget-donors-who-care-for-the-poor
'పేదలను ఆదుకుంటున్న దాతలను ప్రభుత్వం మరిచిపోదు'

By

Published : Apr 22, 2020, 9:00 PM IST

రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదన్న దృఢ సంకల్పంతో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో 1307 మంది నిరుపేదలకు ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రస్ట్ తరఫున రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

ప్రజల శ్రేయస్సుకై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో దాతలు ముందుకు వచ్చి.. తమ గ్రామాలు, పట్టణాల్లోని పేద ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరారు. ప్రభుత్వ సహాయంతో పాటు దాతల సహకారంతో నిరుపేదలకు నిత్యవసర వస్తువులు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముందుకు వచ్చి.. తమ దాతృత్వాన్ని చాటుకుంటున్న దాతలను ప్రభుత్వం ఎన్నటికీ మరువదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-లాక్​డౌన్​ నుంచి వీటికి మినహాయింపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details