వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కేసీఆర్ అంబేడ్కర్ ధోరణినే అవలంభిస్తున్నారు: ఎర్రబెల్లి - latest news on minister errabelli says cm kcr adopts Ambedkar thinking
అంబేడ్కర్ ఆలోచనా ధోరణినే ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. తన స్వగ్రామం పర్వతగిరిలో అంబేడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు.
ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను అవపోసన పట్టిన అపర మేధావి అంబేడ్కర్ అని మంత్రి కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేడ్కర్ ఆలోచనా ధోరణినే అవలంభిస్తున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆయన ఆశయాల మేరకే పరిపాలన జరుగుతోందని, పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని గుర్తు చేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవటమే మనమంతా అంబేడ్కర్‌కి ఇచ్చే అసలైన గౌరవమని అన్నారు.
ఇవీ చూడండి:కరోనా ఎఫెక్ట్: మాస్క్‌లో సీఎం కేసీఆర్