వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో చిరు వ్యాపారుల కోసం నూతన భవనానికై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పరకాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరకాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారని.. అధికారులు అభివృద్ధి పనులపై ప్రత్యేక చొరవ చూపించాలని ఆదేశించారు. పరకాల పట్టణ ప్రజలకు చెక్ డ్యామ్ ద్వారా కాళేశ్వరం నీరు అందిచడానికి కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి,మరియు ఖాళీ స్థలంలో మొక్కలను నాటాలని కోరారు.
"అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయిస్తాం" - parakala
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ అభివృద్ధి కోసం అధికారులు చొరవ చూపించాలని ఆదేశించారు.
"అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయిస్తాం"