తెలంగాణ

telangana

ETV Bharat / state

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి: మంత్రి ఎర్రబెల్లి - Minister Errabelli updates

రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి నిలువుటద్దమన్నారు.

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి
ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : Jan 13, 2021, 8:26 PM IST

రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మంత్రి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి నిలువుటద్దమన్నారు.

రైతుల కుటుంబాల్లో నిజ‌మైన సంక్రాంతి వెలుగు రావాల‌ని ఎర్రబెల్లి ఆకాంక్షించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు, సాగు నీటి ప్రాజెక్టుల‌ను నిర్మించార‌ని గుర్తుచేశారు. ప‌ల్లెప్ర‌‌గ‌తి ద్వారా గ్రామాల‌ను అభివృద్ధి ప‌రచారన్నారు. ప్ర‌జ‌ల స‌హకారంతో ఇక‌ మీదటా ఇదే విధానం కొనసాగుతుందన్నారు. పండుగ‌ను అందరూ ఆనందంగా జ‌రుపుకోవాల‌ని, ఆర్థికాభివృద్ధి చెందుతూ సుఖ‌శాంతుల‌తో, ఆనందంతో జీవించాలని కోరారు.

ఇదీ చదవండి:వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం

ABOUT THE AUTHOR

...view details