తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంసీపీఐ(యు) నేత ఎండీ గౌస్​కు మంత్రి ఎర్రబెల్లి నివాళి - minister errabelli

మారుమూల పల్లె నుంచి జాతీయ స్థాయిలో ఎంసీపీఐ(యు) పార్టీకి ఎనలేని సేవలు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి ఎండీ గౌస్ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా కొత్తూరులో గౌస్​ పార్థివదేహానికి నివాళులర్పించారు.

md gouse death, minister errabelli
ఎండీ గౌస్ మృతి, మంత్రి ఎర్రబెల్లి, ఎండీ గౌస్​కు ఎర్రబెల్లి నివాళి

By

Published : Apr 20, 2021, 12:44 PM IST

ఎంసీపీఐ(యు) ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి గౌస్ పార్థివ దేహానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరంగల్ గ్రామీణ జిల్లా కొత్తూరులోని కామ్రేడ్ గౌస్ నివాసానికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎండీ గౌస్ మృతి, మంత్రి ఎర్రబెల్లి, ఎండీ గౌస్​కు ఎర్రబెల్లి నివాళి

ప్రభుత్వం గౌస్ కుటుంబానికి అండగా ఉంటుందని.. ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మారుమూల పల్లె నుంచి జాతీయ స్థాయిలో ఎంసీపీఐ(యు) పార్టీకి ఎనలేని సేవలు చేసి జాతీయ స్థాయి గుర్తింపు పొందారని కొనియాడారు. కామ్రేడ్ ఎండీ గౌస్​కు జోహార్లు అంటూ మంత్రి ఎర్రబెల్లి నినదించారు.

ABOUT THE AUTHOR

...view details