తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం పేదలకు, రైతులకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులతో కలిసి ఆయన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్, ర్యాలీ నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా.. రైతులతో ఎర్రబెల్లి ర్యాలీ! - వరంగల్ వార్తలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులతో కలసి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో మంత్రి సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్, జోడెద్దుల బండి నడిపి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.
నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా.. రైతులతో ఎర్రబెల్లి ర్యాలీ!
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం మంత్రి ర్యాలీలో పాల్గొన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించారు.
రైతులకు మేలుచేసే ఈ చట్టాన్ని యావత్ తెలంగాణ సమాజం స్వాగతిస్తోందన్నారు. భాజపా నాయకులు చేస్తున్న చౌకబారు విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని మంత్రి చురకలంటించారు.