మంచితనం, అంకితభావం, త్యాగాల స్మరణ ద్వారా మానవ జీవితంలోని నిజమైన స్ఫూర్తిని... మొహర్రం చాటుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. మతసారమస్యానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెర్కవీడులో పీరీల ఉత్సవాలు ప్రారంభించారు. మైనారిటీల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి ఉద్ఘాటించారు.
Minister Errabelli : 'మతసామరస్యానికి ప్రతీక మొహర్రం' - minister errabelli in Muharram celebrations at warangal
మహ్మద్ ప్రవక్త మనవడు...హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని... రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) స్మరించుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెర్కవీడులో పీరీల ఉత్సవాలను ప్రారంభించారు.
మతపెద్దల ప్రార్ధన అనంతరం గ్రామాల్లో పీరీలు ఊరేగుతున్నాయి. చిన్నాపెద్ద పాల్గొని ఉత్సాహంగా గడుపుతున్నారు. హిందూ, ముస్లింలు తేడాలేకుండా... గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు అగ్నిగుండం చుట్టూ "అలై-బలై" ఆడుతూ...అగ్నిగుండంలో అడుగులు వేశారు. మహిళలు బతుకమ్మ పాటలతో అడుగులు వేస్తూ... సంబురాలు జరుపుకున్నారు.
త్యాగనిరతికి ప్రతీక మొహర్రం అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని మొహర్రం గుర్తు చేస్తుందని తెలిపారు. మైనారిటీల భద్రత, సముద్ధరణకు సీఎం కృషి చేస్తున్నారని వెల్లడించారు.
- ఇదీ చదవండి :పండగ ప్రసాదాలు.. బోలెడన్ని పోషకాలు