రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాగలి పట్టి చెలకదున్నారు. ఈ అరుదైన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం రామచంద్రపురం గ్రామంలో చోటుచేసుకుంది. దేవాదుల నీరు విడుదల అనంతరం కాలినడకన కాలువలను పరిశీలిస్తున్న క్రమంలో పక్కనే ఓ రైతు చెలక దున్నుతుండడం గమనించిన మంత్రి... ఆ రైతు వద్దకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. దేవాదుల నీటి విడుదల గురించి రైతుకు వివరించారు.
నాగలి పట్టి చెలక దున్నిన మంత్రి ఎర్రబెల్లి - వరంగల్ రూరల్ జిల్లా వార్తలు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతు అవతారమెత్తారు. వరంగల్ గ్రామీణ జిల్లా రామచంద్రపురంలో నాగలిపట్టి చెలకదున్నారు. దేవాదుల నీరు విడుదల అనంతరం ఓ రైతుతో ఆప్యాయంగా మాట్లాడి అతని వద్ద నుంచి నాగలి తీసుకుని పాట పాడుతూ చెలకదున్నారు.
![నాగలి పట్టి చెలక దున్నిన మంత్రి ఎర్రబెల్లి minister errabelli dayakarrao farming](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:22-tg-wgl-37-chelaka-dunnina-mantri-errabelli-av-ts10144-19052020161150-1905f-1589884910-1046.jpg)
minister errabelli dayakarrao farming
ఇంతలో మంత్రి రైతు వద్ద నుంచి నాగలి తీసుకుని పాట పాడుకుంటూ చెలక దున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న రైతులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇవీ చూడండి: 'ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయి'