కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఇంటివద్దకే నిత్యావసర సరకులు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తోన్న మందులను క్రమం తప్పకుండా వాడి.. వైరస్‌ను జయించాలని సూచించారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో సుమారు 4 వేల మంది కరోనా బాధితులకు నిత్యావసర సరకులు అందజేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి - minister errabelli latest news
కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న రోగులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అండగా నిలిచారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో సుమారు 4 వేల మంది బాధితులకు నిత్యావసర సరకులు అందజేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
వైరస్ బారిన పడినవారు అధైర్యపడొద్దని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ధైర్యంగా వైరస్‌ను జయించాలని సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.