కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా స్వీయ నిర్బంధాన్ని పాటించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని నిరుపేదలకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి నిత్యావసరాలు అందజేశారు.
స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష: మంత్రి ఎర్రబెల్లి - minister errabelli distributed essencials to the poor
కరోనా బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష: మంత్రి ఎర్రబెల్లి
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలంతా స్వీయ నిర్బంధాన్ని పాటించాలని మంత్రి సూచించారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని అన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి ఛైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు