జనగామ జిల్లా కొడకండ్లలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎడ్లబండిలో పయనమయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి నుంచి తన కాన్వాయిలో బయలుదేరిన మంత్రి... దారిమద్యలో ఎడ్లబండ్లలో సమావేశానికి వెళుతున్న రైతులను చూశారు. వెంటనే కాన్వాయి ఆపేసి వారితో కొంతసేపు ఎడ్లబండి నడుపుతూ ప్రయాణం సాగించారు.
సీఎం సభకు ఎడ్లబండిలో వచ్చిన మంత్రి ఎర్రబెల్లి - errabelli dayaker rao attended to cm kcr meeting
రైతువేదిక ప్రారంభ సభకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతులతో కలిసి ఎడ్లబండిలో వచ్చారు. ఎప్పటిలాగే తన కాన్వాయిలో పయనమైన మంత్రి... దారి మధ్యలో ఎడ్లబండ్లతో వస్తున్న రైతులను చూశారు. వెంటనే కారు దిగి బండెక్కి సభకు విచ్చేశారు.
సీఎం సభకు ఎడ్లబండిలో వచ్చిన మంత్రి ఎర్రబెల్లి
మంత్రి కారుదిగి తమతో ఎడ్లబండ్లపై ప్రయాణించడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎడ్లబండి దిగి కారెక్కుతూ... నాకంటే ముందుగా మీరు సభలో ఉండాలని రైతులతో ఛలోక్తులు విసరడంతో రైతుల్లో నవ్వులు పూశాయి.