రైతుల పంటను ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కొనుగోలులో ఎలాంటి వివక్ష చూపించకూడదని పేర్కొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో... అదనపు కలెక్టర్ మహేందర్ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
రైతులు ఇబ్బందిపడకుండా చూడాలి: ఎర్రబెల్లి - ఎర్రబెల్లి దయాకర్ రావు
ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
minister errabelli dayakarrao
రైతు సమన్వయ సమితుల సహకారంతో అన్నదాతలను సన్నద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బంది పడితే ఊరుకునేది లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'వైద్యులు ఒక్క మాస్కును 4 సార్లు వినియోగించాలి!'