తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధి పనుల్లో జాగ్రత్తలు తప్పనిసరి: మంత్రి ఎర్రబెల్లి - ఉపాధి హామీ పనులు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్​నగర్​ శివారు టూక్యా తండాలో ఉపాధి పనులు మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. పనులు చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూలీలకు మంత్రి సూచించారు.

minister errabelli visit
ఉపాధి పనులు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : May 26, 2020, 10:43 AM IST

మాస్కులు ధ‌రించి, భౌతికదూరం పాటిస్తూ... ఉపాధి ప‌నులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూలీలకు సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్​నగర్​ శివారు టూక్యా తండాలో ఉపాధి పనులు పరిశీలించారు. పనులు ఎలా జరుగుతున్నాయని, ఏఏ పనులు చేస్తున్నారని కూలీలను అడిగి తెలుసుకున్నారు.

వలస కార్మికుల ద్వారా గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. మాస్కులు లేని వారికి మంత్రి పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కూలీలను కోరారు.

ఇదీ చూడండి:విష ప్రయోగం.. ఎనిమిది నెమళ్లు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details