తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి ఐనా ఊరిలో సామాన్యుడే... పన్ను కట్టిన ఎర్రబెల్లి - వరంగల్ రూరల్ జిల్లా తాజా వార్తలు

పన్నులు కట్టాలని ప్రజలకు చెప్పడమే కాకుండా తానూ ఆచరించి చూపించారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంత్రి హోదాలో ఉన్నా సామాన్యుడిలాగే తానే స్వయంగా వెళ్లి పన్ను చెల్లించి రశీదు తీసుకున్నారు. ప్రజలంతా సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు.

minister errabelli dayakar rao paid his house tax in warangal rural district
మంత్రి ఐనా ఊరిలో సామాన్యుడే... పన్ను కట్టిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : Oct 3, 2020, 1:26 PM IST

పన్నులు కట్టి ప్రగతికి పాటు పడండి అని మాటలు చెప్పడమే కాకుండా వాటిని ఆచరించారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. తాను మంత్రిగా ఉన్నా సకాలంలో పన్నులు చెల్లిస్తానని తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన నివాసానికి పన్ను కట్టారు.

అందరూ చెల్లించాలి...

ఇంటి పన్ను, నల్లా పన్ను కలిపి రూ.5,220 గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్‌కు తానే స్వయంగా చెల్లించి రశీదు తీసుకున్నారు. మంత్రి పదవిలో ఉన్నా తాను ఊరిలో సామాన్యుడినేనని అన్నారు. ప్రజలంతా పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:'రాబోయే ఎన్నికల్లో ఎంఐఎంతో తెరాస స్నేహపూర్వకపోటీ'

ABOUT THE AUTHOR

...view details