వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar Rao) హరితహారం(Haritha haram) కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన(KCR Tour) ఉండనున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా తడి, పొడి చెత్తను డంప్ యార్డ్‌కి తరలించాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద చెట్లు నాటాలని... వాటిని కాపాడటానికి మండల గ్రామ స్థాయిలో ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.
Errabelli Dayakar Rao: 'గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం ఉండేలా చూడాలి'
గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ప్రతీ గ్రామసభల్లో అడిషనల్ కలెక్టర్, ఎంపీడీవోలు హాజరు కావాలని సూచించారు.
Errabelli Dayakar Rao: 'గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం ఉండేలా చూడాలి'
పది రోజుల్లో వైకుంఠధామాల్లో అన్నీ సదుపాయాలు ఉండాలని సూచించారు. ప్రతీ గ్రామసభల్లో అడిషనల్ కలెక్టర్, ఎంపీడీవోలు హాజరు కావాలని... తప్పనిసరిగా నెలలో కొన్ని రోజులు గ్రామాల్లో నిద్ర చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రత, గ్రీనరీ మొదలైన విషయాలు గమనించి సమస్యలుంటే అక్కడే పరిష్కరించాలన్నారు.
ఇదీ చూడండి:టీకా తీసుకొని.. ధనవంతులుగా మారి..