తెలంగాణ

telangana

ETV Bharat / state

క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిన మంత్రి ఎర్రబెల్లి

సాయం చేయాలనే గుణముంటే... ఏ స్థాయిలో ఉంటేంటీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరూపించారు. రోడ్డుపై ద్విచక్ర వాహనం ఢీకొని గాయాలైన వ్యక్తిని గమనించిన మంత్రి వెంటనే కాన్వాయ్ ఆపి బాధితుడి దగ్గరికెళ్లి పరామర్శించారు. ఆర్థికసాయం అందించి తన కారులో ఆసుపత్రికి తరలించారు.

minister errabelli dayakar rao sent injured person to hospital in warangal
క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : Feb 16, 2021, 5:27 PM IST

మరోసారి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కొలన్​పల్లి శివారులో ద్విచక్రవాహనం ఢీ కొని ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. అటు నుంచి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ ఆపి... స్వయంగా నీళ్లు తాగించారు. అనంతరం ఆర్థిక సాయం అందించి తన కారులో ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:కనికరించని కన్న కొడుకులు.. రోడ్డుపైనే తల్లిదండ్రులు

ABOUT THE AUTHOR

...view details