వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. వర్షాలు తగ్గగానే చెరువులను పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్వతగిరి వాగుని, ప్రకృతి వనం స్థలాన్ని.. వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి పరిశీలించారు.
చెరువులన్నీ నింపండి.. పనులను ఆపొద్దు: ఎర్రబెల్లి - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్తలు
వర్షాలు తగ్గుముఖం పట్టగానే అన్ని చెరువులను నింపాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు.
పర్వతగిరి మండలంలోని ఎస్పారెస్పీ పరిధిలోని 33 చెరువులు, నీటిపారుదల శాఖ పరిధిలోని 64 చెరువులు కొంత మేరకు నిండాయన్నారు. నిండని చెరువులను ఎస్సారెస్పీ, నీటుపారుదలశాఖల అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆవకుంటకు నీరు రావడానికి ఫీడర్ కాలువ పునరుద్ధరణపై దృష్టిసారించాలన్నారు. అర్బన్ పథకం కింద పర్వతగిరి చెరువు ఆధునీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పర్వతగిరి ప్రకృతి వనం స్థలాన్ని పరిశీలించిన మంత్రి వనం పెన్సింగ్, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం తదితర చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఇవీచూడండి:ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీని అభినందించిన సీఎం కేసీఆర్